Crédits
INTERPRÉTATION
Ghantasala
Interprète
P. Susheela
Interprète
COMPOSITION ET PAROLES
M. S. Viswanathan
Composition
Acharya Athreya
Paroles/Composition
Paroles
ఎవరు నీవు నీ రూపమేది
ఏమని పిలిచేది
నిన్నేమని పిలిచేది
ఎవరు నీవు నీ రూపమేది
ఏమని పిలిచేది
నిన్నేమని పిలిచేది
నేనని వేరే లేనేలేనని
నేనని వేరే లేనేలేనని
ఎలా తెలిపేది
మీకెలా తెలిపేది
నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని
కలలతో నింపిన కరుణవు నీవో
పూజకు తెచ్చిన పూవును నేను
పూజకు తెచ్చిన పూవును నేను
సేవకు వచ్చిన చెలిమిని నేను
వసివాడే ఆ పసిపాపలకై
వసివాడే ఆ పసిపాపలకై
దేవుడు పంపిన దాసిని నేను
నేనని వేరే లేనేలేనని
ఎలా తెలిపేది
మీకెలా తెలిపేది
ఎవరు నీవు నీ రూపమేది
ఏమని పిలిచేది
నిన్నేమని పిలిచేది
చేదుగ మారిన జీవితమందున
తీపిన చూపిన తేనెవు నీవు
చేదుగ మారిన జీవితమందున
తీపిన చూపిన తేనెవు నీవు
వడగాడ్పులలో వడలిన తీగకు
చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురులు తొడిగిన చినుకే మీరు
కోరిక లేక కోవెలలోన
వెలుగై కరిగే దీపం నీవు
దీపంలోని తాపం తెలిసి
దీపంలోని తాపం తెలిసి
ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు
Written by: Acharya Athreya, M. S. Viswanathan

