Clip vidéo

Clip vidéo

Crédits

INTERPRÉTATION
U.V.Niranjan
U.V.Niranjan
Interprète
Sri Krishna Vishnubhotla
Sri Krishna Vishnubhotla
Interprète
Vinod Kumar
Vinod Kumar
Interprète
COMPOSITION ET PAROLES
U.V.Niranjan
U.V.Niranjan
Composition
Vinod Kumar
Vinod Kumar
Paroles/Composition

Paroles

కళ్లతో కాటేసినావే కౌగిలే కాజేసినావే
నవ్వుతో ముల్లేదో గుచ్చి మాయేసేసావే
నల్లని కాటుక నెట్టి
తెల్లని మల్లెలు చుట్టి
తియ్యని మాటేదో సెప్పి
గుండెను కోసావే
అరుగు మీద అవ్వల్లే నువ్వే
నురగ మీద నీడల్లే నువ్వే
కునుకు పోతే కలలాగా నువ్వే
నేనేటి సెయ్యాలే
పువ్వు సూత్తే రంగల్లే నువ్వే
తాకి సూత్తే తేనల్లే నవ్వే
ఊపిరిట్టా చెంగుల్లో కట్టి
నా ప్రాణాలే తీస్తివే
ఎట్టా మారానే పిల్లా
చేసావే కనికట్టు నల్లా
గుట్టే సెప్పేసి మల్లా
అట్టా వగ్గేయకే
ఏట్లో సేపల్లె దూకి
సలవ సంద్ర మట్టా ఈది
ముక్కు తాడిట్టాయేసి కొంగున కట్టేయకే
నల్ల మబ్బు జుట్టట్టా దువ్వి
తెల్లచుక్క జడనట్టా ఎట్టి
కంతిరీగ నడుమిట్టా ఊపి
ఎట్టా పోతున్నవే
సల్లగాలి నడిమిట్టా దూరే
ఆపలేని సలి రేపుతుంటే
కంగుగాలి సెగనిట్టా అంపి
మంటే పెట్టినావే
నువ్వట్టా దగ్గరికొస్తే
గుండే గంటై మోగుతుందే
ఏమట్టా ఎందుకు అంటే
నువ్వే తానన్నదే
ఓసి బంగారి రంగుల మైనా
ఆశే రేపావే గుండెలలోన
మబ్బుల్లో జాబిల్లి కూన
నిన్ను కన్నుల్లో దాచేసుకోనా
ఎట్టా మారానే పిల్లా
చేసావే కనికట్టు నల్లా
గుట్టే సెప్పేసి మల్లా
అట్టా వగ్గేయకే
ఏట్లో సేపల్లె దూకి
సలవ సంద్ర మట్టా ఈది
ముక్కు తాడిట్టాయేసి కొంగున కట్టేయకే
కలువపూల బుట్టల్లే నువ్వు
కట్ట మీద నడిసెల్లిపోతే
ఏటిలోని పూలన్నీ గూడి
తిట్టి పోస్తున్నాయే
రాతిరేల మెరుపల్లె నువ్వు
మిణుకు మంటూ మెరిసెల్లిపోతే
సీకటింటి మిణుగురులన్నీ బోసి పోతున్నాయే
అంగట్లో గాజులు తెచ్చి
నీకే నేను పెట్టేయనా
లేదంటే పుస్తెలు కట్టి
ప్రాణం నీకియ్యనా
అరే కయ్యాల వయ్యారి తోట
ఇంక చాలంట అల్లరి ఆట
సెప్పేయే దాచున్న మాట
సెయ్యి పట్టేసి ఎత్తుకుపోతా
ఎట్టా మారానే పిల్లా
చేసావే కనికట్టు నల్లా
గుట్టే సెప్పేసి మల్లా
అట్టా వగ్గేయకే
ఏట్లో సేపల్లె దూకి
సలవ సంద్ర మట్టా ఈది
ముక్కు తాడిట్టాయేసి కొంగున కట్టేయకే
కళ్లతో కాటేసినావే కౌగిలే కాజేసినావే
నవ్వుతో ముల్లేదో గుచ్చి మాయేసేసావే
నల్లని కాటుక నెట్టి
తెల్లని మల్లెలు చుట్టి
తియ్యని మాటేదో సెప్పి
గుండెను కోసావే
అరుగు మీద అవ్వల్లే నువ్వే
నురగ మీద నీడల్లే నువ్వే
కునుకు పోతే కలలాగా నువ్వే
నేనేటి సెయ్యాలే
పువ్వు సూత్తే రంగల్లే నువ్వే
తాకి సూత్తే తేనల్లే నవ్వే
ఊపిరిట్టా చెంగుల్లో కట్టి
నా ప్రాణాలే తీస్తివే
Written by: U.V.Niranjan, Vinod Kumar
instagramSharePathic_arrow_out

Loading...