Crédits
INTERPRÉTATION
Shreya Ghoshal
Interprète
COMPOSITION ET PAROLES
K. M. Radhakrishnan
Composition
Veturi
Paroles/Composition
Paroles
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా
పిల్లపాపల వాన బుల్లిపడవల వాన
చదువుబాధలే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలివాన కబాడీ వేడివేడి పకోడి
ఈడుజోడు డీ డీ డీ డీ తోడుండాలి ఓ లేడి
ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో
ఇంటి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణమాసాల జల తరంగం
జీవనరాగాలకిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
కోరి వచ్చిన ఈ వానా
కోరివచ్చిన ఈ వాన గోరువెచ్చనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాటలే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో
నల్లనిమేఘాల మెరుపులందం
తీరని దాహాల వలపు పందెం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
Written by: K M Radha Krishnan, K. M. Radhakrishnan, Veturi, Veturi Sundara Ramamurthy