म्यूज़िक वीडियो
म्यूज़िक वीडियो
क्रेडिट्स
PERFORMING ARTISTS
Dr. M. Balamuralikrishna
Performer
COMPOSITION & LYRICS
Sree Bhadrachala Ramadas
Composer
गाने
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలసి కొలువగ రఘుపతి యుండెడి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
అనుపమానమై అతి సుందరమై
ధనరు చక్రము ధగ ధగ మెరిసెడి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
పొన్నల పొగడల పూ పొదరిండ్లను
చెన్నుమీరగను శృంగారంబగు
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
అదిగో చూడండి
అదిగో చూడండి
Written by: Sri Bhadrachala Ramadas


