Dari
PERFORMING ARTISTS
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
Composer
Acharya Athreya
Songwriter
Lirik
మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం
మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం
తరచి చూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును
పూడిపోయిన గొంతులా ఓడిపోయిన గుండెలా
పూడిపోయిన గొంతులా ఓడిపోయిన గుండెలా నీలో
ఊపిరాడక ఉన్నదీ హృదయమే అర్పించుకున్నదీ
హృదయమే అర్పించుకున్నదీ
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును
పువ్వులోని పిందెలా పిందెలోని తీపిలా
పువ్వులోని పిందెలా పిందెలోని తీపిలా
నీలో లీనమైనది కానరానిదీ నీ పదము తానై మూగపోయినదీ
మూగపోయినదీ
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును
మనసు మూలలు వెతికి చూడూ
మరుగు పొరలను తీసి చూడూ
మనసు మూలలు వెతికి చూడూ మరుగు పొరలను తీసి చూడూ
ఏదో మబ్బుమూసి మసక కమ్మి మమత మాయక ఉన్నది నీ మనిషి తాననుకున్నదీ
మీటి చూడు నీ హృదయాన్ని.పలుకుతుంది ఒక రాగం
తరచిచూడు నీ గతాన్ని మెదులుతుంది ఒక రూపం
ఆ రూపం ఎవ్వరిదో ఆ రాగం ఎక్కడిదో తెలుసుకుంటే చాలును నీ కలత తీరిపోవును
Written by: Acharya Athreya, K. Chakravarthy