Dari

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Pendyala Nageswara Rao
Composer
P. Narasimha Rao
P. Narasimha Rao
Songwriter

Lirik

కుండ కాదు కుండా కాదు చిన్నాదానా
నా గుండెలదరగొట్టినావే చిన్నాదానా
కుండ కాదు కుండా కాదు చిన్నాదానా
నా గుండెలదరగొట్టినావే చిన్నాదానా
పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగి చూడ కన్నులలోనా
మెరుపు మెరిసినే
ఒలికిన అందాలతో
మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్నూ ఎరుగవైతివి
ఓహో హో కుండ కాదు కుండా కాదు చిన్నాదానా
నా గుండెలదరగొట్టినావే చిన్నాదానా
మొదటి చూపులోనే మనసు దోచుకొంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు
దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినా గానీ తెలియవైతివే
ఓహో హో కుండ కాదు కుండా కాదు చిన్నాదానా
నా గుండెలదరగొట్టినావే చిన్నాదానా
నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
వచ్చినట్టి నీ నెపము
వేచినట్టి నా తపము
ఫలము నిలుపుకొందమన్నా నిలువవైతివి
ఓహో హో కుండ కాదు కుండా కాదు చిన్నాదానా
నా గుండెలదరగొట్టినావే చిన్నాదానా
Written by: P. Narasimha Rao, Pendyala Nageswara Rao
instagramSharePathic_arrow_out

Loading...