Dari
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
Chitra
Performer
COMPOSITION & LYRICS
Raj
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
Lirik
ఆటాడుకుందాం రా అందగాడా
అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ
ఒప్పుకో సరదాగా
సై సై అంటా (హోయ్ హోయ్)
చూసేయ్ అంటా (హోయ్ హోయ్)
నీ సొమ్మంతా (హోయ్ హోయ్)
నాదేనంటా (హోయ్ హోయ్)
ఆటాడుకుందాం రా అందగాడా
అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ
ఒప్పుకో సరదాగా
ఓరి గండు తుమ్మెదా
చేరమంది పూపొద
ఓసి కన్నె సంపద
దారి చూపుతా పదా
మాయదారి మన్మథా
(మరీ అంత నెమ్మదా)
అంత తీపి ఆపదా
(పంట నొక్కి ఆపెదా)
వయస్సుంది వేడి మీద
వరిస్తోంది చూడరాద
తీసి ఉంచు నీ ఎద
వీలు చూసి వాలెద
ఓ రాధ నీ బాధ
ఓదార్చి వెళ్లేదా
ఆటాడుకుందాం రా అందగాడా
అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ
ఒప్పుకో సరదాగా
ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
హాయ్ నిప్పు మేలుకున్నది
(తప్పు చేయమన్నది)
రెప్ప వాలకున్నది
(చూపు చుర్రుమన్నది)
మరీ లేతగుంది body
భరిస్తుందా నా కబాడి
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది
ఆటాడుకుందాం రా అందగాడా
అందరా చందురూడా
అల్లేసుకుందాం రా మల్లెతీగ
ఒప్పుకో సరదాగా
Written by: Raj, Sirivennela Sitarama Sastry

