Dari
PERFORMING ARTISTS
Thaman S.
Performer
Shreya Ghoshal
Performer
Kaala Bhairava
Performer
Akhil Akkineni
Actor
Nidhhi Agerwal
Actor
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Srimani
Lyrics
Lirik
నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయాన
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా
నాకే సాధ్యమా నిన్నే మరువడం
నాదే నేరమా నిన్నే కలవడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం
గాయం చేసి వెళుతున్నా, గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలినా
గమ్యం చేరువై ఉన్నా, తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా
నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా
ఓ' నవ్వే కళ్ళతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనుక నీరే నువ్వని చూపక
తియ్యని ఊహలా కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం ఉందని తెలుపక
నువ్వని ఎవరని తెలియని గురుతుగా
పరిచయం జరగనే లేదంటానుగా
నటనైపోదా బ్రతుకంతా, నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక
మరిచే వీలు లేనంత, పంచేసావే ప్రేమంతా
తెంచెయ్మంటే సులువేం కాదుగా
మనసులే కలవడం, వరమా? శాపమా?
చివరికి విడువడం, ప్రేమా! న్యాయమా?
నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా...
Written by: Srimani, Thaman S.