Dari
PERFORMING ARTISTS
K.S. Chithra
Performer
COMPOSITION & LYRICS
Jayavijayan
Composer
Sahithi
Lyrics
Lirik
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
మూడు మూర్తుల నీవే అంబవు కదవే
ముగ్గురమ్మలా మహా మూలము నీవే
కనక దుర్గ వ్రతము పూని
కానుకతో మ్రొక్కు తీర్చు
జనులేల్లా పొందెదరు కామితార్దము
కన్నెలకే కలుగులే నిశ్చితార్దము
సంసార సౌఖ్యము
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
విజయ వాటిక కృష్ణా పుణ్య తటమున
ఇంద్రకీల పర్వతాన వెలసియుంటివే
కృష్ణ పొంగులే నీదు ముక్కు పుడకనే
తాకితేనే లోకమంత ప్రళయమంటివే
సార సాక్షి నీ దృక్కులే
నా భక్తికి సాక్ష్యం అని
సాష్టాంగపు దీక్షనుంటి నీ గుడి ముందే
సార సాక్షి నీ దృక్కులే
నా భక్తికి సాక్ష్యం అని
సాష్టాంగపు దీక్షనుంటి నీ గుడి ముందే
ప్రాణాచారము నందే
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
వాసవి నీవే సింహ వాహిని నీవే
కామ కోటి దివ్య పీఠ వాసివి నీవే
కాళివి నీవే ఖడ్గదారివి నీవే
ఘోర దైత్య మహిసాసుర మర్దిని నీవే
దేవి నీదు నవరాత్రుల వేడుకలే
జరిపించి కొలువు దీర్చి
కోర్కె తీర కొలుతును నిన్నే
దేవి నీదు నవరాత్రుల వేడుకలే
జరిపించి కొలువు దీర్చి
కోర్కె తీర కొలుతును నిన్నే
కోటి ఫలములనీవే
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ
మదిని నిన్నే గతిగ నమ్మి కొలిచితినమ్మ
మూడు మూర్తుల నీవే అంబవు కదవే
ముగ్గురమ్మలా మహా మూలము నీవే
కనక దుర్గ వ్రతము పూని
కానుకతో మ్రొక్కు తీర్చు
జనులేల్లా పొందెదరు కామితార్దము
కన్నెలకే కలుగులే నిశ్చితార్దము
సంసార సౌఖ్యము
Written by: Jayavijayan, M. Jayachandran, Sahithi

