Dari
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
Chitra
Performer
COMPOSITION & LYRICS
Raj
Composer
Koti
Composer
Veturi
Songwriter
Lirik
చందమామ కన్నుకొట్టే సందెవేళ
సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేల
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెళ
అందమంతా ఆరబెట్టి పైట జారే
కోడెగాలి కొట్టగానే కోక జారే
పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టే సందెవేళ
సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రారా పంచదార మాపటేల
తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెళ
జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా
కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా
వాలింది పొద్దు
వడ్డించు ముద్దు
తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా
నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
కౌగిళ్లు పట్టు
కవ్వింత కొట్టు
నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా
ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల
చలి తీరాలి సాయంత్రం
చందమామ కన్నుకొట్టే సందెవేళ
సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేల
తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెళ
మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా
జాబిల్లి జంట
జాగారమంటా
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా
శ్రీ కంచి పట్టు
స్త్రీ కన్ను కొట్టు
హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని
పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని
చిలకమ్మా నీ కోసం
చందమామ కన్నుకొట్టే సందెవేళ
సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెళ
మంచే కాడుంది రారా పంచదార మాపటేల
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెళ
అందమంతా ఆరబెట్టి పైట జారే
కోడెగాలి కొట్టగానే కోక జారే
పడలేనీ ఆరాటం
Written by: Koti, Raj, Veturi