Lirik

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా మారనే మారవా మారమే మానవా మౌనివా మానువా తేల్చుకో మానవా పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా (డోలు డోలరె డోలారే డోలారే) (డోలు డోలరె డోలారే డోలారే) ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్ర గన్నేరునై నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై మోజులే జాజులై పూయనీ హాయిని తాపమే తుమ్మెదై తీయనీ తేనెని పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out