Video musicale
Video musicale
Crediti
PERFORMING ARTISTS
P. Susheela
Lead Vocals
COMPOSITION & LYRICS
T. V. Raju
Composer
C. Narayana Reddy
Songwriter
Testi
ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ హొయ్
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
సొగసైన బిగువైన నాదే నాదే
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
ఓ ఓ ఓ ఒహొహొ
ఓ ఓ ఓ ఒహొ హొహొ ఒహొ హొహొ ఓ ఓ
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద నేనే నేనే
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
Written by: C. Narayana Reddy, T. V. Raju