Crediti

PERFORMING ARTISTS
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
P. Adinarayana Rao
P. Adinarayana Rao
Composer
C. Narayana Reddy
C. Narayana Reddy
Songwriter

Testi

వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు
వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలీ వినిపించేను
ఆతని పావన పాదధూలికై అవని అనువనువు కలవరించేను
అతని రాకకై అంతరంగమె పాల సంద్రమై పరవసించేను
పాల సంద్రమై పరవసించేను
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
వెన్నెలలెంతగ విరిసినగాని చంద్రున్నీ విడిపోలేవూ
కెరటాలెంతగ పొంగినగానీ కడలిని విడిపోలేవూ
కలిసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైన దారులు వేరైన
తనువులు వేరైన దారులు వేరైన ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే, నిలిచేనులే
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు
వెన్నెలలెంతగ విరిసినగాని చంద్రున్నీ విడిపోలేవూ
కెరటాలెంతగ పొంగినగానీ కడలిని విడిపోలేవూ
కలిసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైన దారులు వేరైన
తనువులు వేరైన దారులు వేరైన ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే నిలిచేనులే
సాహిత్యం: డా౹౹. సి. నారాయణ రెడ్డి: పి.సుశీల
Written by: C. Narayana Reddy, P. Adinarayana Rao
instagramSharePathic_arrow_out

Loading...