歌詞

నేల నేల నేల నవ్వుతోంది నాలా నత్త నాడి పొద్దు సూరీడులా వేల వేల వేల సైన్యం అయ్యి ఇవ్వాళ్ల దూసుకెళ్లమంది నాలో కల సర్ర సర్ర సర్ర ఆకాశం కోసేసా రెండు రెక్కలు తొడిగేసా (తొడిగేసా) గిర్ర గిర్ర గిర్ర భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా (తిరిగేసా) ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగిరేసా సంతోషాల జెండ జెండ जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो వెతికా నన్ను నేను, దొరికా నాకు నేను నాలో నేనే ఎన్నో వేల వేల మైల్లు తిరిగి పంచేస్తాను నన్ను, పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్ని పొంగిపోయి ప్రేమై వెలిగి ఘుమ్మ ఘుమ్మ ఘుమ్మ గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా (హే వస్తా) కొమ్మ కొమ్మ రెమ్మ పచ్చంగా నవ్వేలా పన్నీటి జల్లుల్నే తెస్తా (హే తెస్తా) ఎడారిని కడలిగా చేస్తా చేస్తా जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो స్వార్ధం లేని చెట్టు, బదులే కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమి పట్టనట్టు, బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషని చూడకుంటే అర్ధం లేదే సల్ల సల్ల సల్ల పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే (హే కంటే) విల్ల విల్ల విల్ల అల్లాడిందే ప్రాణం చేతైన మంచే చెయ్యకుంటే (చెయ్యకుంటే) ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो जागो जागोरे जागो जागोरे जागो जागोरे जागो जागो
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out