クレジット
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Hamsalekha
Composer
Samavedam Shanmukha Sarma
Songwriter
歌詞
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా
అయ్యో అందనీ అనాధనైతీ మంజునాథా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ ఆ ఆ
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా
అయ్యో ఛీ పొమ్మంటినే పాపినైతినే
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం
Written by: Hamsalekha, Samavedam Shanmukha Sarma

