クレジット
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Pendyala
Composer
C. Narayana Reddy
Songwriter
歌詞
చిరునవ్వుల తొలకరిలో... సిరిమల్లెల చినుకులలో...
పలికెనులే హృదయాలే... పలికెనులే హృదయాలే...
తొలివలపుల కలయికలో...
చిరునవ్వుల తొలకరిలో... సిరిమల్లెల చినుకులలో...
వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా... నీవే నా జీవనాడిగా...
ఎగిసేను గగనాల అంచులలో
ఓ... విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో...
చిరునవ్వుల తొలకరిలో... సిరిమల్లెల చినుకులలో...
ఉరికే సెలయేరులన్నీ వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా... నీవే నా పుణ్యమూర్తిగా...
ధ్యానించు నా మధుర భావనలో
ఓ... మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో...
చిరునవ్వుల తొలకరిలో... సిరిమల్లెల చినుకులలో...
ఆ... పలికెనులే హృదయాలే తొలివలుపుల కలయికలో...
చిరునవ్వుల తొలకరిలో... సిరిమల్లెల చినుకులలో...
Written by: C. Narayana Reddy, Pendyala, Pendyala Nageswara Rao