クレジット
PERFORMING ARTISTS
Anurag Kulkarni
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Composer
Ramajogayya Sastry
Songwriter
歌詞
అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నటగాయత్రి
మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి
నిండుగా ఉందిలే దుర్గదీవెనం
ఉందిలే జన్మకో దైవకారణం
నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం
ఆ నటరాజుకు స్త్రీరూపం
కళకే అంకితం నీ కణకణం
వెండితెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరిత పుటలోన వెలుగు పొదిగావు
పెనుశిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచెరగుల తల ఎత్తినది మన తెలుగు
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుదకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువ్వు నడిచిన ఈ మార్గం
కనుకేగా మరి నీదైనది నువ్వుగా అడగని వైభోగం
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
Written by: Mickey J Meyer, Ramajogayya Sastry