ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
S. Janaki
Lead Vocals
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
Composer
C. Narayana Reddy
Songwriter
歌詞
పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...
పగలే వెన్నెల జగమే ఊయల
నింగిలోన చందమామ తొంగి చూచే
నీటిలోని కలువభామ పొంగిపూచే...
ఈ అనురాగమే జీవన రాగమై
ఈ అనురాగమే జీవన రాగమై
ఎదలో తేనె జల్లు కురిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల
కడలి పిలువ కన్నె వాగు పరుగు తీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా
పగలే వెన్నెల జగమే ఊయల
నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే
పూల రుతువు సైగ చూసి సిఖము పాడే
నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే
పూల రుతువు సైగ చూసి సిఖము పాడే
మనసే వీణగా జనజన మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...
పగలే వెన్నెల జగమే ఊయల
Written by: C. Narayana Reddy, S. Rajeswara Rao


