ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
Chitra
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Veturi
Songwriter
歌詞
డుమ్ డుమారే డుమ్ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే... భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగుభళారే... భళారే
ఆళ్గర్ పెరుమాళు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి
(చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా)
(చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా)
(తందనలా తారారతో గండాలు మాకు తప్పించారా)
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత
డుమ్ డుమారే డుమ్ డుమారే పిల్ల పెళ్ళి చాంగుభళారే... భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగుభళారే... భళారే
మధురాపురికే రాచిలకా రాలేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసినా పన్నీటి ముత్యాలెన్నో
కనుచేపలకు నిదురంటూ రారాదని
కరగెంటానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
గూటిలో కోలాటం గుండెలో ఆరాటం
ఎదలో మొదలాయే పోరాటమే
ఆళ్గర్ పెరుమాళు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి
అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా
తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
నా పేగుముడి ప్రేమగుడి నా తల్లిలే
నువ్వు నా అండగా నాకుండగా కంపించి పోదా కైలాసం
ఇపుడే శుభ లగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా
ఆళ్గర్ పెరుమాళు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారనీ ఈ రాత్రి
(చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా)
(చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టెయ్యరా)
(తందనలా తారారతో గండాలు మాకు తప్పించారా)
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత
Written by: Mani Sharma, Veturi