ミュージックビデオ
ミュージックビデオ
クレジット
PERFORMING ARTISTS
K. S. Chithra
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
歌詞
అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే
ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హా హాకారం
మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం
అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
Written by: Ilaiyaraaja, Ilaya Raja, Sirivennela Sitarama Sastry