クレジット

PERFORMING ARTISTS
Hari Priya
Hari Priya
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shree Mani
Shree Mani
Songwriter
Shreemani
Shreemani
Songwriter

歌詞

చిన్నపుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్తదేదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం దేది
బళ్ళోకెళ్ళే వేళా రెండు జళ్ళు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువ్పడే కష్టం
తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం
గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్పడే కష్టం
రెప్పల తలుపు మూసి కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే కొత్త కబురులంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఇష్టం
అది నాకోసం నువ్పడే కష్టం
Written by: Devi Sri Prasad, Shree Mani, Shreemani
instagramSharePathic_arrow_out

Loading...