ミュージックビデオ

Mari Antaga Video Song || SVSC Movie Video Songs || Venkatesh, Mahesh Babu, Samantha, Anjali
{artistName}の{trackName}のミュージックビデオを見る

クレジット

PERFORMING ARTISTS
Sri Rama Chandra
Sri Rama Chandra
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

歌詞

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పరేశానుగా గడబిడ పడకు అలా మతోయెంతగా శృతే పెంచక విచారాల విల విలా సరే చాలిక అలా జాలిగా తికమక పెడితె ఎలా కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిను చూడాలంటే అద్దం జడిసేలా ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా సరే చాలిక అలా జాలిగా తికమక పెడితె ఎలా ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా చీ పొమ్మనీ కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల చమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు మనుషులనిపించే ఋజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల
Writer(s): Sirivennela Sitarama Sastry, Mickey J Mayor Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out