クレジット

PERFORMING ARTISTS
Rajesh
Rajesh
Performer
Chitra
Chitra
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
E S Murthy
E S Murthy
Songwriter

歌詞

ప్రేమా ఎందుకని నేనంటే
అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే
కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది
ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది
తియ్యని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం
పరుగున వస్తుంది
ప్రేమా ఎందుకని నేనంటే
అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే
కానుకిచ్చినావు
పాటలా వినిపించే ఆమె
ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల
ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలిసే
వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే
నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే
అంత సంబరం
ప్రేమా ఎందుకని నేనంటే
అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే
కానుకిచ్చినావు
ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసంలో వస్తుందో
జత కలిపే శుభ సమయం
అందాకా మరి ఆగాలంటే
వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం
వింత అనుభవం
ప్రేమా ఎందుకని నేనంటే
అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే
కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది
ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది
తియ్యని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం
పరుగున వస్తుంది
ప్రేమా ఎందుకని నేనంటే
అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే
కానుకిచ్చినావు
Written by: E S Murthy, S. A. Raj Kumar
instagramSharePathic_arrow_out

Loading...