ミュージックビデオ

ミュージックビデオ

クレジット

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Chitra
Chitra
Performer
Chiranjeevi
Chiranjeevi
Actor
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

歌詞

(గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప
గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప)
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
(గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప
గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప)
నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి
ప్రేమే పందిరై బతుకే విరబూసే వేళ
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
(గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప
గరెగపరిస, గరెగపరిస
గరెగమప)
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముద్దు భాష చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా
నీలో లీనమై నేనె నువ్వనిపించేలా
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది
మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది
(గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప
గరెగపరిస, గరెగపరిస
గరెగమప, గరెగమప)
Written by: S. A. Raj Kumar, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...