가사
అందాల నా రాజ అలుకేలరా
ఔనని కాదని అనవేలరా
అందాల నా రాజ అలుకేలరా
ఔననీ కాదని అనవేలరా
అందాల నా రాజ అలుకేలరా
చెందురుడాపైన సందడి చేసేను
డెందము లోలోన తొందర చేసేను
అందని వలపులు గంధము పూసేను
అందని వలపులు గంధము పూసేను
సుందరి జాలిగ చూసేనురా
అందాల నా రాజ అలుకేలరా
మరులను చిలికించు చిరునవ్వులేమాయే
మనసును కవ్వించు కనుసన్నలేమాయే
మదనుని చూపులు మరి మరి పదునాయే
మదనుని చూపులు మరి మరి పదునాయే
మౌనము చాలించి నన్నేలరా
అందాల నా రాజ అలుకేలరా
ఔననీ కాదని అనవేలరా
అందాల నా రాజ అలుకేలరా
Written by: C. Narayana Reddy, T. V. Raju