가사
గుండెలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
గుండెలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
ఊపిరి మాత్రం ఉన్న
పలంగా పోతున్నట్టుందే
ఉక్కిరి బిక్కిరి సేసే
భాదే చుట్టుముట్టిందే
ఓరోరి దేవుడో ఎన్నెన్ని
సిత్తరాలు సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా
ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో ఎన్నెన్ని
సిత్తరాలు సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా
ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
రాయిరప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో
దేవత సేత్తావు
రక్తమాంసాలు మాకు పోసి
మట్టి పాలుకమ్మంటావు
అమ్మా ఆలి బంధాలిచ్చి
అంతలోనే తెంచి లోకంలోన
ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావూ
ఓరోరి దేవుడో ఎన్నెన్ని
సిత్తరాలు సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా
ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో ఎన్నెన్ని
సిత్తరాలు సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా
ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
Written by: Adigarla Karuna Kumar, Jakes Bejoy, Karunakar Adigarla