가사

అమ్మా అని కొత్తగా మళ్లీ పిలవాలని తుళ్లే పసి ప్రాయమే మళ్లీ మొదలవ్వని నింగీ నేలా నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా మళ్లీ పిలవాలని తుళ్లే పసి ప్రాయమే మళ్లీ మొదలవ్వని నిదురలో నీ కల చూసి తుళ్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగీ నేలా నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళ నీ వెతను మనసెపుడైన పోల్చుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా వేదనలు పంచిన మాకు వేకువున్నదా నింగీ నేలా నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా నను వీడొద్దే అమ్మా బంగారం నువ్వమ్మా
Writer(s): Vanamaali, Mickey J Mayor Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out