Songteksten

(కళ్ళల్లో కల వరమై కల వరమై గుండెల్లో పరవశమో వరమై కళ్ళల్లో కల వరమై కలవరమో వరమే అవ్వగా కళ్ళల్లో కల వరమై కల వరమై గుండెల్లో పరవశమే వశమై కళ్ళల్లో కల వరమై కల వరమై కలిగే కోరికా) ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే (పాలబుగ్గలోని తళుకులే వెన్నుపూసలోన వణుకులై కంటిపాపలోన కవితలా మారె చిన్ని మనుసులోని పువ్విలా పసిడివన్నెలోని నవ్వులా లేతపెదవిపైన ముత్యమై మెరిసే) ఏవో ఏవో ఏవో ఆశలే మెల్లగా ఎదపై తీపి మధువే చల్లగా ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా మైమరపించు మాయే చేయగా అణువణువు అలజడి రేగి తమకంలో తేల్చుతుంటే ఆ ఆదమరపులోన ఈడు సతమతమైయ్యే (పాలబుగ్గలోని తళుకులే వెన్నుపూసలోన వణుకులై కంటిపాపలోన కవితలా మారె చిన్ని మనుసులోని పువ్విలా పసిడివన్నెలోని నవ్వులా లేతపెదవిపైన ముత్యమై మెరిసే)
Writer(s): Vihari Kondapally Prasanth, Shreshta Shreshta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out