Songteksten

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది ఓహో... హోహో... హేహే కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది ఓహో... ఓహో కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా భామదాసు నేనై ప్రేమ కోసుకోనా బంతిపూల హారాలేసి ఆరాధించనా నా చెలి నామం తారకమంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా ఓహో... ఓహో కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది హేహే హేహే హేహే ఓహో హేహే
Writer(s): Chandrabose, S.a.raj Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out