Muziekvideo

Muziekvideo

Credits

PERFORMING ARTISTS
KK
KK
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Songteksten

ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే, కనుపాప ఇంతే, లోకం లోతు చూడాలంతే
ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే, కనుపాప ఇంతే, లోకం లోతు చూడాలంతే
మొగ్గల్లోన దాగుంది కాయో పండో కనిపెట్టాలి ముందే
మబ్బుల్లోన దాగుంది చినుకో తూఫానో పసిగట్టాలి ముందే
మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో మనసెట్టి చూడాలంతే
ఈ మట్టిలోని వజ్రం చూడు, బొగ్గులోని అగ్గిని చూడు
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే
ఏ ఇలా చేస్తే తిరుగే లేదంతే
రాశి ఫలాలన్నీ వచ్చును నీ వెంటే
తొమ్మిది గ్రహాలన్ని పనులే మాని తిరుగును నీ చుట్టే
ఇంతే ఇంతింతే
ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే
గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే గుణముండాలి నీలో
మేడల్లోని అమ్మడికి ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో
దేశాన్నే శోకం నుంచి, చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి
నీ పనుల్లోను శ్రామికుడల్లె, పగలు రేయి కార్మికుడల్లె
సముద్రంలో నావికుడల్లె ముందుకు పొతుంటే
జనం మెచ్చే నాయకుడవుతావు
జగం మెచ్చే ఉత్తముడౌతావు
ప్రపంచంలో దేవుడివౌతావు
ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడౌతావు
ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే, కనుపాప ఇంతే, లోకం లోతు చూడాలంతే
Written by: Chandra Bose, Mani Sharma
instagramSharePathic_arrow_out

Loading...