Teledysk
Hariharan – Najpopularniejsze utwory
Tekst Utworu
ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
ఓ వరములా దొరికెనీ పరిచయం
నా మనసులో కురిసెనే అమృతం
నా నిలువునా అలలయే పరవశం
నీ చెలిమికే చేయనీ అంకితం
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
నీ ఊపిరే వెచ్చగా తగలనీ
నా నుదుటిపై తిలకమై వెలగనీ
నా చూపులే చల్లగా తాకనీ
నీ పెదవిపై నవ్వుగా నిలవనీ
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం
ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది
Writer(s): Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com