Teledysk
Teledysk
Kredyty
PERFORMING ARTISTS
Sarath
Performer
Vivek Sagar
Performer
Avanti Cinema
Performer
COMPOSITION & LYRICS
Vivek Sagar
Composer
Camp Sasi
Songwriter
Sai Yogi
Songwriter
Tekst Utworu
బాటపొంటి పోయే పోరగాడ
జర సర్దుకో
అరె సద్దిమూట వంటీ
కమ్మనైన ముచ్చటొకటి ఇనుకో
నువ్వు లెక్కవెట్టె సుక్కలన్నీ
అరచేతికందనివే
అవి సిక్కబట్ట పిట్టవోలె
ఎగారాలే…
తందారే తందరే తందరే
తందారే తందరే తందరే
ఓ ఊరే ఇడిసి సందెకాడ
నువ్వు తోవ బట్టే
పోయేదారే అంతే తెల్వని దూరం
కోరి కోరి ఎంచుకున్న జిందగీరా ఇది
అచ్చ - బుర ఐనా తప్పదే
కోరి కోరి ఎంచుకున్న జిందగీరా ఇది
అచ్చ - బుర ఐనా తప్పదే
ఎక్కి రైలెక్కి నువ్వు
దస్తి ఏసుకో
కాజిపేట - హనుమకొండ
దాటి ఎల్లిపో
అరె పట్టాలు వట్టి నువ్వు శేహరు జేరుకో
అరె పట్టాలు వట్టి నువ్వు శేహరు జేరుకో
ముష్కిల్ ఎంత ఉన్న గాని
మాస్తి జేసుకో
ఫుల్లు తాగి నువ్వు పాట పాడుకో
ఓ పొరగా
ఇంకో శాందార్ ముచ్చట జెప్త ఇను
పైడి జైరాజ్ గురించి ఏర్కేనా ?
మన కరీంనగర్ అయనా
తెలంగాణా ముద్దు బిడ్డ రా నైనా
బ్రిటీషోల్ల జామానల బొంబాయి కి వొయ్యి
వందమీద డెబ్బై సిన్మాలల్ల యాక్టింగ్ జేశిండు
గప్పుడు హిందీ సిన్మలల్లా కత్తి తిప్పలన్నా
దార్కారి చేతలు చెయ్యలాన్నా గైనే
అక్కడి తోపులతోటి నెగిలీ
ఆళ్ళకి సరిసమానంగా నిలబడ్డడు అనుకో
సూపర్ స్టార్ అయ్యిండు
ఆ వెండితెర రారాజు
పైడిరాజుని గుండెనిండ తల్సుకో
ఇగ పని శురు జేసుకో - బేఫికర్గుండు
ఆ అమితాబచ్చను ఇల్లు ఇడిసినాది గిందుకే
గా పర్ద మీద జాదు నిన్ను గుంజినాది గందుకే
నువ్వు ఎక్కబోయే స్టేప్పులన్నీ
లెక్కవెట్టనీకే సూడకే
అరె సెంగు సెంగుమంటు
నువ్వు ఉరకాలే
తందారే తందరే తందరే
తందారే తందరే తందరే
Written by: Camp Sasi, Sai Yogi, Vivek Sagar