Kredyty
PERFORMING ARTISTS
Wilson Herald
Performer
Nikhita Srivalli
Performer
Sampoornesh Babu
Actor
VK Naresh
Actor
Venkatesh Maha
Actor
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Composer
Vanamali
Songwriter
Tekst Utworu
ఈ గాలిలో అటువైపో ఎటువైపో
తలవూపి నవ్వేటి ఓ పువ్వల్లే
లోకంలో ఉన్నా నలుపేదో తెలుపేదో
కనలేని ఆనందం దాగుందిలే
ఆ నవ్వుల్లో
మరకే లేని మురికైపోని
ఈ స్నేహమే
మసకెయ్యని మబ్బుల్లేని ఆకాశమే
ఏ లెక్కంటూ చిక్కంటూ లేనే లేని
నాదంటూ నీదంటూ ఊసేరాని
మదిలో అచ్చం ఓ స్వాతిముత్యం తానంట
మనసే స్వచ్ఛం ఏ కల్లా కపటం లేదంట
నువు ఎవరని ఎవరడగని
బతుకును తడిమి
అడకనే దొరికినదొక మెరుగుల చెలిమి
అహ తెలియని తనమే వెలిగెను గుణమే
ఇదివరకెపుడూ తెలియని స్వరమే
గలగలగల తన పలుకులు
నడుపుతు ఉంటే
ఆ ఇది కుడియని
అది ఎడమని తెలిసెనదిపుడే
ఓహో మిలమిల మెరుపై
మెరెసెను కనులే
మునుపెరుగని ఓ పయనం మొదలే
ఏ అక్షరం లేని కాగితంపై
ఓ కొత్త రాతలా
ఓ లక్ష మాటల్లో చెప్పలేని ఆనందమే
తెచ్చింది తానేగా
ఎవరూ ఎపుడూ సరదాకైనా
రాని ఈ గూటికి
తానే చుట్టంలా
ఇదిగో ఇటుగా
వచ్చింది వరమల్లే ఈనాటికి
తానో నేస్తంలా
Written by: Mickey J Meyer, Smaran Sai, Vanamali

