Créditos

INTERPRETAÇÃO
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Vocais principais
COMPOSIÇÃO E LETRA
Ramesh Naidu
Ramesh Naidu
Composição
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Composição

Letra

నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా
ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కల పారి పోవాలి లే
ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే.
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా
నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా
Written by: Ramesh Naidu, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...