Créditos

INTERPRETAÇÃO
Vani Jayaram
Vani Jayaram
Vocais principais
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Interpretação
COMPOSIÇÃO E LETRA
M. S. Viswanathan
M. S. Viswanathan
Composição

Letra

అహ హహ ఆహ
అహ హహ ఏహే ఏహే ఆహ లాలా
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీ సరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణమూ ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ
నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
Written by: Athreya, M. S. Viswanathan
instagramSharePathic_arrow_out

Loading...