Letra

నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా నీతో చేరి ఆ కలలు అన్నీ నిజమౌతాయిగా మొమాటానికి చోటు లేదుగా నిన్న మొన్నలా కాదు గా ఆరాటానికి అంతు లేదుగా నువ్వే పక్కనే ఉండగా నీ కొంటె చూపుల్లో ఏమి ఉందో అర్ధమవుతుంటే మాయగా వాలుకన్నుల్లో బొమ్మలా నే మారిపోతుంటే చాలుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా ముసిముసి నవ్వులు మూగ సైగలు ముదిరిన వేళలో పెదవుల అంచున తీపి ముద్దులు అడిగిన హాయిలో నలుగురూ దారే ఉన్న వేళ తీరు మారేనా అటు ఇటూ చూసి దొంగ దారే వెతుకుతున్నానా మనసులోన ఏవేవో కథలు చేరగా కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా నీకు నాకు దూరాలు అన్న మాటే రాదుగా దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా ఉలకదు పలకదు చిట్టి మనసే నువ్వు నన్ను పిలవని రోజున ఉరకలు పరుగులు కన్నె వయస్సుకి నిన్ను కలసిన ప్రతి క్షణమున ఏటి పై నావ సాగినట్టు ఊహలో నువ్వే చేరగా చేతిలో చెయ్యే వేసుకుంటే గీతలే నేడు మారగా ప్రియవదనా ప్రియవదనా నువ్వుంటే చాలుగా ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా
Writer(s): Kittu Vissapragada, Saravana Vasudevan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out