Letra

ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనీవాసుడి వారసుడీ విష్ణు దాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే రాచలకు రాజు ఈ రంగరాజననే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంట దైవం కోసం పోరే సమయం లేదంట రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
Writer(s): Himesh Vipin Reshammiya, Vennelakanti Subbu Rajeswara Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out