Vídeo de música
Vídeo de música
Créditos
PERFORMING ARTISTS
Karthik
Performer
COMPOSITION & LYRICS
Vijai Bulganin
Composer
Suresh Banisetti
Songwriter
Letra
నీలాకాశంలోన రెండు అందమైన
రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే
ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన
వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే
ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే
కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే
చూస్తే తెల్లబోదా వానవిల్లే
తీపి కలలే కంటూ కళ్ళే
ఎర్రబారిపోయే పగడాలల్లె
అన్నీ విడ్డూరాలే
అంతుపట్టలేని ఆరాటాలే
ప్రేమనేది రెండే అక్షరాలు
లెక్కపెట్టలేము దాని లక్షణాలు
ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ
ఆశ వచ్చే
ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా
మైకం వచ్చే
దూరంగుంటే ఏడుపొచ్చే
దగ్గరగుంటే హాయి వచ్చే
ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ
చూపు పంపే కబురు
పట్టి ఆపలేరు ఏ ఒకరు
ప్రేమ దారంతే
దూకుతుంటే తలపు
దాచి పెట్టలేదు ఏ తలుపు
ప్రేమ తీరంతే
చెప్పలేని ఎన్నో కథలు
ఇప్పుడేగా ఇద్దర్లోనూ మొదలు
నిండిపోవా గదులు
జ్ఞాపకాలు పారే జీవ నదులు
మనసు మీద రాసుకున్న పేరు
ఎన్ని జన్మలైనా ఎవరూ చెరపలేరు
ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ
ఆశ వచ్చే
ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా
మైకం వచ్చే
దూరంగుంటే ఏడుపొచ్చే
దగ్గరగుంటే హాయి వచ్చే
ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ
నీలాకాశంలోన రెండు అందమైన
రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే
ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన
వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే
ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే
కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే
చూస్తే తెల్లబోదా వానవిల్లే
తీపి కలలే కంటూ కళ్ళే
ఎర్రబారిపోయే పగడాలల్లె
అన్నీ విడ్డూరాలే
అంతుపట్టలేని ఆరాటాలే
గూడు కట్టుకున్న ఆనవాళ్ళు
గుండె చాటు నుంచి పోవు వంద ఏళ్ళు
Written by: Suresh Banisetti, Vijai Bulganin