Создатели
ИСПОЛНИТЕЛИ
Разные исполнители
Исполнитель
МУЗЫКА И СЛОВА
Ilaiyaraaja
Композитор
Acharya Athreya
Автор песен
Слова
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొత్తాలయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబో
ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారమ్మా
నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్లితివేమో మన్నుతిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్నుతినంగ నే చిచువును ఆకొంతినో వెద్దినో చూదు నోరు
వెర్రిది అమ్మేరా
వెర్రిది అమ్మేర పిచ్చిదామె కోపంరా
పచ్చికొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా
ఏడుపోత్తోంది నాకేడుపోత్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవలు ఇత్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడతారు చెప్పు
అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
తిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నాన్న ఎవలమ్మా
చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను
యశోదను కానురా నిను దండించ
సత్యను కానురా నిను సాధించ
ఎవ్వరు నువ్వని
ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు
ఎవరు కానని విడిచి వెళ్లకు, నన్ను విడిచి వెళ్లకు
ఆ వెళ్ళము వెళ్ళములేమ్మ
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్
అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న
ఆహ ఊరుకోను
నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
Written by: Acharya Athreya, Ilaiyaraaja