Видео
Видео
Создатели
ИСПОЛНИТЕЛИ
Разные исполнители
Исполнитель
P. Susheela
Исполнитель
Bhanupriya
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Ilaiyaraaja
Композитор
Sirivennela Sitarama Sastry
Автор песен
Слова
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్లు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్లు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
లయకే నిలయమై
నీ పాదం సాగాలి
ఆహ్హ హ హ్హ హ హా
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి
ఆహహా హ హ హా
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
తిరిగే కాలానికి తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సుర గంగకు
విలువేముంది విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
దూకే అలలకు
ఏ తాళం వేస్తారు
ఆహహా హ హ హా
కమ్మని కలల పాట
ఏ రాగం అంటారు
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల
విలువేముంది విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్లు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ
మెరుపల్లే తుళ్లు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్లు
Written by: Ilaiyaraaja, Sirivennela Sitarama Sastry