Создатели
ИСПОЛНИТЕЛИ
Yazin Nizar
Исполнитель
Hebah Patel
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Devi Sri Prasad
Композитор
Sree Mani
Автор песен
Anantha Sriram
Автор песен
Слова
మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీవల్లేనా
వెళ్ళేదారిలో లేడే చంద్రుడే
అయినా వెన్నెలే, అది నీ అల్లరేనా
ఓ' చెట్టునీడనైనా లేనే, పైన పూలవాన
మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీవల్లేనా
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాత్తిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా
నేనుకాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచెప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటిగాటే నిజం
కిందమీదపడి రాసుకున్న పదికాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ' మనమధ్య దారంకైనా దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన
రాగాలు తీసే నీవల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీవల్లేనా
ఓ.ఉ.ఒ.హో
Written by: Anantha Sriram, Devi Sri Prasad, Sree Mani

