Создатели
ИСПОЛНИТЕЛИ
Hariharan
Ведущий вокал
Clinton
Исполнитель
МУЗЫКА И СЛОВА
A. R. Rahman
Композитор
Veturi Sundararama Murthy
Автор песен
ПРОДЮСЕРЫ И ЗВУКОРЕЖИССЕРЫ
A. R. Rahman
Продюсер
Слова
సఖియా... చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి
చెలి పండు
సఖియా... చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన
తొలి పండు
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎర్ర ముక్కులే పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికే కోపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యా వర్ణ మంత్రాలు వింటే
ఎర్రని పంట పాదమంటే
కాంచనాల జిలుగు పచ్చ
కొండబంతి గోరంత పచ్చ
పచ్చ పచ్చ పచ్చ
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం
సఖియా... చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి
చెలి పండు (Oh)
సఖియా... చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన
తొలి పండు
అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పువ్వు తొలి వర్ణం
ఊదా పూరెక్కలపై వర్ణం
ఎన్నో చేరే నీ కన్నె గగనం
నన్నే చేరే ఈ కన్నె భువనం
రాత్రి నలుపే రంగు నలుపే
వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
సఖియా... చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి
చెలి పండు (Oh)
సఖియా... చెలియా (yeah yeah)
నీ ఒంపే సొంపే తొణికిన
తొలి పండు
తెల్లని తెలుపే ఎద తెలిపే
ఒఒఓ ఒఒ ఒఒ ఒఒ ఒఒఓ (yeah yeah)
వానలు కడిగిన తుమి తెలుపే
ననన ననన నననా (yeah yeah)
తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలుపే (yeah yeah)
ఇరు కనుపాపల కధ తెలిపే
ఉన్న మనసు కుదిపే (yeah yeah)
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే (yeah yeah)
Written by: A. R. Rahman, Veturi Sundararama Murthy

