Создатели
ИСПОЛНИТЕЛИ
P. Susheela
Ведущий вокал
МУЗЫКА И СЛОВА
S. Rajeswara Rao
Композитор
Daasarathi Krishnamacharyulu
Автор песен
Слова
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఏడిపించి మేను మరచి ఎగిరి నవ్వుకుంటరు
నవ్వి నవ్వి చివరకు నవ్వులపాలౌతారు
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
లేనిపోని డాబులతో లెక్కలేని కోతలతో
లేనిపోని డాబులతో లెక్కలేని కోతలతో
గడుసుగడుసు మాటలతో మిడిసిపాటు చేతలతో
కాలరెత్తి తిరుగుతారు కాళ్ళబేరమాడతారు
హ ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
ముందు తీగలేకుంటే పందిరితో పని ఉందా
ముందు తీగలేకుంటే పందిరితో పని ఉందా
పునాదులే లేకుంటే భువిని గోడ ఉంటుందా
ఆ పునాదులే లేకుంటే భువిని గోడ ఉంటుందా
తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా
తరుణులసలు లేకుంటే పురుషుల పని గోవిందా
గోవిందా గోవిందా హహ
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి
ఎవరికి తెలియదులే యువకుల సంగతి
Written by: Daasarathi Krishnamacharyulu, Dasarathi, S. Rajeswara Rao

