Создатели
ИСПОЛНИТЕЛИ
Gowtham Bharadwaj
Исполнитель
Ramya Behara
Исполнитель
Chaitan Bharadwaj
Исполнитель
МУЗЫКА И СЛОВА
Chaitan Bharadwaj
Композитор
Ramajogayya Sastry
Автор песен
Слова
దేవేరి నువ్వే నా ఊపిరి
నీకోసం పుట్టాడీ ప్రేమ-పూజారి
దేవేరి జన్మ నీదే మరి
నీతోనే వందేళ్ళ పూల-రాదారి
నువ్వంటే నేను, నీవెంటే నేను సదా
నిజమిది నిజం ఇరువురమొకరే మనం
దీవెనలిడి తథాస్తని పలికెనే శుభసమయం
తనువుల సగం ఒకటిగ ఒదిగే క్షణం
నీ మధువుల పెదాలకే పరిణయం మధురమయం
నువ్వు నాకు విలువైన కానుక
లేదు జీవితం నువ్వంటూ లేక
ఉండలేను నిన్ను చూడక
కాంతి నీవే కథానాయక
నువ్వే నాకు ప్రత్యేకం, నీతో ఉంది నా లోకం
లేనిదేదీ లేదే ఇక
నువ్వు పూలమాసం, నీతో సావాసం
కావాలి కడదాక
నిజమిది నిజం ఇరువురమొకరే మనం
దీవెనలిడి తథాస్తని పలికెనే శుభసమయం
తనువుల సగం ఒకటిగ ఒదిగే క్షణం
నీ మధువుల పెదాలకే పరిణయం మధురమయం
Written by: Chaitan Bharadwaj, Ramajogayya Sastry

