Слова

చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చెలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగి ఉన్నాలే పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా నేనేనా ఇది అంటూ అనిపించేనా ఔనౌను నేనే మరి కాదా చిత్రంగా నాకే నే కనిపించేనా కవ్వించే చిత్రాన్నయ్యాగా నా దారినే మళ్లించిన తుళ్లింతల వరదలా పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేలా నేరుగా సరసకి నేనిలా, మారగా మరి మదీ తీరుగా పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
Writer(s): Sagar Mudumba Sai Vivek, Shreshta Shreshta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out