Слова

గుండెదాటి గొంతుదాటి పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం ఋణపాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం ఋణపాశం విధి విలాసం అడగాలేకానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలేకానీ పలికేటి తోడునీడైపోతా నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో చెయ్యందించమంది ఒక పాశం ఋణపాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం ఋణబంధం నోరారా వెలిగే నవ్వుల్ని నేను కళ్ళారా చూశా రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిశా నీతో ఉంటే చాలు ప్రతినిమషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం ఋణపాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం ఋణబంధం ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం
Writer(s): M. M. Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out