Слова

ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వు ఎదసడే హద్ధులు దాటే చూడూ చూడు చూడు కుదురుగా ఉందామన్న ఉంచట్లేదే నన్నే నువ్వు నిదరకే నిప్పెడతావే రోజూ రోజూ రోజూ నీ చూపుల్లోన బాణం అందంగా తీసే ప్రాణం నీ మౌనంలోన గానం ప్రాణాలు పోసే వైనం అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా రిబపప్ప రిబపప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబపప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబపప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబపప్ప రిబపప్ప పా ఆలకించుకో నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ నీలోనే దాచేసుకో ఎప్పుడూ ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని ముద్రించుకున్నాను చిలకా నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని చదివేసుకున్నాను తెలుసా చెలియా నాపై కొంచం మనసుపెట్టూ నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ కుదరదనకు వలపు వెన్నెలా రిబపప్ప రిబపప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబపప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబపప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబపప్ప రిబపప్ప పా ఆలకించుకో నువుతప్ప నాకేమి కనిపించదు నువుతప్ప చెవికేది వినిపించదు నువులేని ఏ హాయి మొదలవ్వదు నువురాని నా జన్మ పూర్తవ్వదు నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా చూస్తూనే ఉంటాను తెలుసా నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా మోస్తూనే ఉంటాను మనసా నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా మురిసి మురిసి రోజూ అలసిపోతా అలిసి అలిసి ఇట్టే వెలిసిపోతా వెలిసి వెలిసి నీలో కలిసిపోతా తెలుసుకోవె కలల దేవతా రిబపప్ప రిబపప్ప పా మనస్సంతా సమర్పించుకో రిబపప్ప రిబపప్ప పా వరం ఇచ్చుకో రిబపప్ప రిబపప్ప పా ప్రశాంతాన్ని ప్రసాదించుకో రిబపప్ప రిబపప్ప పా ఆలకించుకో
Writer(s): Gorthi Vijaya Brahmanandam, Banisetti Suresh Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out