Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Ghantasala
Lead Vocals
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
Composer
Lyrics
చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు పిలచి. సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచీ వలచీ చెంతకు చేరీ నా సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ
చూచీ వలచీ చెంతకు చేరీ సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ
అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి
అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి
సందిట బంది చేసీ
సందిట బంది చేసీ నా బందీ వశమైపోతి
చూచీ వలచీ చెంతకు చేరీ సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ
నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి
నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ
సఖునీ ఒడిలో సురిగీ కోటి సుఖముల శిఖరమునైతీ
చూచి వలచి చెంతకు పిలచి. నీ సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
నీవే జగమై నీలో సగమై నేటికి నిండుగ పండితి
చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచీ వలచీ చెంతకు చేరీ సొగసులు కానుక జేసి
నీ మగసిరి బానిసనైతీ
సాహిత్యం: ఆరుద్ర వీరాభిమన్యు: కె.వి. మహదేవన్: ఘంటసాల, సుశీల
Written by: Arudra, K. V. Mahadevan