Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Srini
Performer
Sujatha
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
Bhuvana Chandra
Songwriter
Lyrics
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదే నా హృదయం
ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే ఉంటై పక్కపక్కనే చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండూ వేరేలే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచీ
రేయిని మలిచి కనుపాపలుగా చేశావో
కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి మెరుపుల తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
అయినా మగువా మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
బ్రతికేస్తా
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ గాలి నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపనదెవరు, ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదు నా హృదయం
ఓపదు నా హృదయం
Written by: A. R. Rahman, Bhauvanachandra, Bhuvana Chandra