Music Video

Music Video

Lyrics

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే...
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఈ పూటా చెలి నా మాటా ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికీ జీవనమరణమూ నీ చెతిలో ఉన్నదిలే...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే...
వెన్నెలమ్మా నీకు జోల పాడి కాలి మెటికలు విరిచేనే...
వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగులా చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే...
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే...
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
Written by: A. R. Rahman, Rajasri
instagramSharePathic_arrow_out

Loading...